Site icon Sanchika

గాతము

[dropcap]“కి[/dropcap]రస్తానము వాళ్లకి, సాయిబులకి ఒగరే దేవుడు. కాని మనకు

లెక్కలేని దేవుళ్లు, వీళ్లు సాల్దని నంది, పంది, గువ్వు, ఇట్లా మూగజీవాలు

దేవుళ్లు దీన్ని ఎట్ల అర్ధము చేసుకొనేది తాత”

“ఆత్రము పడితే అర్ధము చిక్కెల్దు పా, నిదానముగా ఆలోచన చేయి

మన పెద్దాళ్లు ఏమిటికి ఇట్ల చెప్పిరనేది నీకు తెలుస్తుంది.”

“నా చేతిలా అయెల్దు తాత నువ్వే చెప్పు”

“మన విశ్వములా గ్రహాలంతా ఒగటికి కాదు, నక్షత్రాలంతా

ఒగటిగా లేదు. ఇంగ మన బూలోకములా జంతువులు శానా

రకాలు, గువ్వలు రకరకాలు, అట్లే చేపలు, చెట్లూ ఇంగ ఈడ

వుండే మనుషులు ఒగరకమే అయినా బాసలు, యాసలు, బదుకు

పంట, పంటలు యారే యారే, ఇన్ని యారేయారేలా దేవుడు

మాత్రము ఎట్ల ఒగడైతాడు. అసలు మనిషి మాత్రమే దేవుడని

ఎట్లంటాము. ఈ అర్ధములానే మన పెద్దాళ్లు మూగ జీవాలనీ

మన్నునీ మానునీ కూడా దేవుడనిరిపా”

“ఎంత గాతముగా వుండే సమాచారాన్ని ఇంత బాగా చెప్పితివి తాతా

మడి ఒగ దేవుడు అనే వాళ్ల కత ఏమితాతా”

“కత కంచికీ మనం ఇంటికి అనెట్లపా, అయినా

వాళ్ల పెద్దతనము వాళ్లది, మన పెద్దతనము మనది, మనందరి

పెద్దతనము, గాతము ప్రకృతిది పా”

“సరే తాత ఉంటాను”

“ఉండుపా నీ గాతాన్ని గలీజు చెయ్యకుండా వుండుపా”


గాతము = లోతు

Exit mobile version