Site icon Sanchika

గీతాంజలి మినీ కవితలు

[శ్రీమతి గీతాంజలి రచించిన మినీ ‘ప్రేమ కవిత’లను పాఠకులకు అందిస్తున్నాము.]

1)
ప్రేమలో నేను అలిసిపోలేదు.
ప్రేయసీ.. నా అస్థికల సాక్షిగా చెబుతున్నా..
ఇంకా నీ జ్ఞాపకాలనే శ్వాసిస్తున్నా.
**
2)
నిన్ను పిలిచి పిలిచి అలిసిపోయా.
అందుకే పెదవుల మీదే
నీ పేరు రాసుకున్నా.
**
3)
ఆమె ముదిమి అయిపోయింది.
ఆమె.. ముఖం మీది ముడుతలు
నన్ను తలచుకున్నప్పుడల్లా
ప్రేమదుఃఖంతో ముడుచుకు పోయినవి కాదు కదా..
అందుకే ఏడ్చినా ఆమె ఇంకా సౌందర్యభరితంగా కనిపిస్తుంది.
**
4)
నువ్వొచ్చి చెప్పకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిన నగరం..
చంద్రుణ్ణి.. నక్షత్రాలని కోల్పోయిన ఆకాశంలా..
వేదనతో కన్నీళ్ళని దిగమింగి
రాత్రిలోకి ముడుచుకుపోయింది.. అచ్ఛం నాలా!
**
5)
చూడు.. వేసవి వర్షం
మల్లెల.. మట్టి పరిమళ యుగళ గీతం పాడుతోంది..
వినిపించట్లేదా.. నేను గుర్తుకు రావట్లేదా?

Exit mobile version