Site icon Sanchika

‘గీతరచనాదీపిక’ గ్రంథావిష్కరణ సభ – ఆహ్వానం

[dropcap]రా[/dropcap]ష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత – సాహితీ కళారత్న శ్రీ కొణతం నాగేశ్వరరావు రచించిన ‘గీతరచనాదీపిక’ గ్రంథావిష్కరణ సభ తేదీ 12-3-2023, ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు – గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో – గుంటూరులోని శ్రీ కొరటాల మీటింగ్ హాల్ (2/7 బ్రాడీపేట)లో జరుగుతుంది.

శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య (అధ్యక్షులు, గుంటూరు జిల్లా రచయితల సంఘం) సభాధ్యక్షత వహిస్తారు.

ప్రొ. గుజ్జర్లమూడి కృపాచారి (విశ్రాంతాచార్యులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం) గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు.

సరస్వతీ పుత్ర డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు (హంస అవార్డు గ్రహీత); నటశేఖర శ్రీ తుర్లపాటి రాధాకృష్ణమూర్తి (కవి, పండితులు, నాటక ప్రయోక్త) ఆత్మీయ అతిథులుగా వ్యవహరిస్తారు.

శ్రీ మేళం బాబూరావు (విశ్రాంత వైస్-ప్రిన్సిపల్, హిందూ కళాశాల, గుంటూరు) గ్రంథాన్ని స్వీకరిస్తారు.

శ్రీ ఎం. కృష్ణకిషోర్ (భాషాప్రవీణ), శ్రీ కె.జె. రమేష్ (ఉపాధ్యక్షులు, గుంటూరు జిల్లా రచయితల సంఘం) గ్రంథ సమీక్ష చేస్తారు.

శ్రీ ఎస్.ఎం సుభానీ (ప్రధాన కార్యదర్శి), శ్రీ నానా (కోశాధికారి) సభను నిర్వహిస్తారు.

సాహితీ ప్రియులందరికీ ఆహ్వానం.

Exit mobile version