(ఫ్రాన్స్ నవలా రచయిత్రి అనీ ఎర్నాక్స్ కి సాహిత్యంలో 2022 సంవత్సరపు నోబెల్ ప్రైజ్ వచ్చిన సందర్భంగా)
[dropcap]ఆ[/dropcap]మె ప్రేమించే సమాజం
గొప్ప ఆత్మీయ బంధాల లోగిలి
ఆరని కష్టాలూ కన్నీళ్ళను
తీర్చిన విశ్వ సాహితీ వాకిలి
ఫ్రాన్స్ మట్టిలో పుట్టిన అనీ ఎర్నాక్స్
బతుకు శ్రామిక నేపధ్య కుటుంబం
చీకటితో స్నేహించిన సృజన
సూర్యరశ్మిని పరిచిన తాత్త్వికత
ఆమె ఓ మహత్వ కలం యోధ్ధ
ఆమె రచనలు తన ఆత్మకథ కాన్వాస్ లోనే
పురుడు పోసుకున్నవి
ఆమె గర్భ విఛ్ఛిత్తిని తన కలమే
చిత్రిక పట్టడం ఓ చారిత్రిక సాహసం
ఓ అసాధారణ ప్రేరణకు ఆవరణ
సామాజిక స్ఫూర్తిని ఆవహించిన
సన్నిహిత సంబంధాలు,
సున్నితమైన అంశాల వేళ్ళను స్పర్శించింది
యూరోప్ లోని
స్త్రీ జాతిలో ధైర్యం నింపిన
ఆమె రచనలు అద్భుత అక్షర కథనాలు
ఓ సామాజిక వైద్య ఓషధులు అవి
అనీ ఎర్నాక్స్ రాసిన
‘ఎ ఉమెన్స్ స్టోరీ’తో
ఆమె కలం
ప్రపంచ ప్రకంపనలు సృష్టించింది
అనీ ఎర్నాక్స్ కలంలోంచి వచ్చిన
ప్రసిధ్ధ నవలలు ఎన్నో…
‘నేను చీకటిలో వున్నాను,
‘ఒక మనిషి స్థలం ఒక స్త్రీ కథ’,
‘ఒక ఘనీభవించిన స్త్రీ’ నుండి గెట్టింగ్ లాస్ట్, వరకూ …
స్త్రీల బతుకు బాధలే కేంద్రకమై
నిలిచాయి
సమాజం కేంద్ర బిందువుగా
ఆమె కలానికి బలాన్నిచ్చాయి
బతుకు ఊపిరి నింపిన స్ఫూర్తి
బాటలు అవి
ఆమె నవలలను అనువదించాయి
విశ్వభాషలన్నీ వాటిలోకి
సాహిత్యంలో ఆమెది
విలక్షణమైన ఆలోచనల ఒరవడి
ఆర్తులు, వంచితులు,గాయపడ్డ,
నిస్సహాయ నిరుపేద స్త్రీల
బతుకులపై సంధించిన విల్లంబులు
అవి నిత్య సామాజిక దారి దీపాలు
ఓ ప్రభావశీల నవలాకారిణి
సాహితీ సిగలో
తురిమిన పూవే
ఆమెను అందుకున్న నోబెల్ ప్రైజ్
సృజనాత్మకతకిదే అక్షరాంజలి
ఘనీభవించని సృజన చైతన్యం
అనీఎర్నాక్స్ కలం చలనం
ఆమె రచనలో జీవధాతువు
ద్రవిస్తుంది ఆ సృజన స్త్రీల బాధలపై
అది మూసిన గదిలోకి
కిటికీ సందుల్లోంచి దూసుచొచ్చే గాలి
నిజంగానే
ఆ సృజన ప్రవహిస్తుంది గుండె లోతుల్లోకి
నదీ తరంగాలై
చీకటి గుహలోకి
స్థానభ్రంశమైన మయూఖలా
సామాజిక రుగ్మతలకు
అక్షరాల చికిత్సచేస్తూ బతుకు