[dropcap]ఎం[/dropcap]త కురిసినా తనివి తీరదు వర్షానికి
ఎంత తరచినా లోటే మనిషి జీవితానికి.
గెలుపు కోసమే బ్రతుకున పరుగెత్తకు నేస్తం
ఓటమి చాటున త్యాగం ఋషివి కావటానికి.
పరిమళాన్ని అందించి రాలి పోదా కుసుమం
బ్రతుకు కొంచమైతేనేం ఖుషీ చేయటానికి.
బ్రతుకంతా సుఖ పడితే చాలు నాకు అనుకునేవు
ఒక్క క్షణం చాలు రగిలి మనిషి పోవటానికి.
కడగండ్లను చూసి కలత నిద్ర నీకు ఏల ‘శ్రీయా’
నిదురలోని తీపి కలలే మనీషి కావటానికి.