Site icon Sanchika

గజల్

[box type=’note’ fontsize=’16’] స్వార్థంతో మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, జీవితాన్ని మైమరచి చూడాలంటున్నారు శ్రీరామదాసు అమరనాథ్గజల్” లో. [/box]

[dropcap]వ[/dropcap]దిలేసిన జ్ఞాపకం ఎదలోనే ఉన్నది
ఒక్కక్షణం మనసు గదిని తెరిచి చూడమన్నది.

అందనంత ఎత్తులో నీలిమేఘమున్నా
కరిగి తరిగి భువికి దిగి తరచి చూడమన్నది.

నదిలో నడిచే నావకు తెరచాపే లేకున్నా
అలలతో నడచి దరిని పిలిచి చూడమన్నది.

నిదురలోన ఎన్నెన్నో కలలు పలుకరించినా
కనుల ముందు నిజం నిలచి మరచి చూడమన్నది.

స్వార్ధంతో మనిషి ఎంత ఎత్తుకెదిగినా ‘శ్రియా’
నీటిబుడగ జీవితాన్ని మైమరచి చూడమన్నది.

Exit mobile version