[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. వధ
గో పూజ
గో వధ
మనిషి వ్యథ
ఇదో
దీన గాథ
~
2. సంక్షోభం
కారుచీకటిలో
టార్చ్ లైట్ వెలుగులో
భారమైన అరువుతో
భరత మాత అడుగులు
సంక్షోభం వీడి
సూర్యరశ్మి వెలుగులో నడిచేదెన్నదో
~
3. ప్రజాస్వామ్యం
నేడు
వలలో ఉంచి
నీట ముంచిన చేప
~
4. చేనేతలు
తనువుకు
తొడిగే చేతలు
తిండి లేక
ఉరి తాడును
ముద్దాడుతున్న చేతులు