[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. నాణ్యం
అధికారం ప్రతిపక్షం
నాణెం కోసమే
నాణ్యత మరచి
నాణ్యమైన
గుర్తు కావాలి
ఈ దేశానికి
నాణెం కోసం
చూడని ఓటు కావాలి
ఆ గుర్తుకి!
~
2. వంచన
ఎగిరే గాలిపటంపై
వంచన చినుకులు
వంచకుల చినుకుల్లో
తడిచిన గాలిపటాన్ని!
~
3. అక్షరం
అక్షరాన్ని కొలిచాను
తొలిచి తొలిచి
మనిషిని చేసింది
~
4. ఎందుకు
వాంఛల వేటలో
వదిలేస్తున్నావెందుకు
కొన్నాళ్ళకు
వెదికినా దొరకని తంతుకు
తెర తీస్తున్నావెందుకు