Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-16

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. ఎన్నికలు

ఎన్నెన్ని
కలలో
కల్లలో!

~

2. వాగ్దానం

ఎన్నోసార్లు
తెగిన
గాలిపటం!

~

3. చరవాణి

సంచార
స్వర్గం

చపలచిత్త
మార్గం

హద్దు దాటితే
నరకం

~

4. మాట

సంజీవిని
యమపాశం
అమృత కలశం

Exit mobile version