Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-2

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. ఓటు

ప్రజాస్వామ్య వృక్షానికి
రసం పీల్చే
పురుగు పట్టింది
ఓటు మందు వేయండి

~

2. జాడ్యం

అల్లకల్లోల
అలజడి పెరిగింది
పిడికిలి అలికిడే లేదు

~

3. చరిత్ర

అవమానమే సోపానం
ఆకలే అమృతం
ఓటమే విజయం
సంకల్పమే సాధన
తలక్రిందుల చిత్రమే
చరిత్ర..!

~

4. గాండ్రించు

బతుకు

బతుకు
గుదిబండైంది
గర్జన కోసం
ఎందుకు తర్జన భర్జన
గాండ్రించు

Exit mobile version