గోలి మధు మినీ కవితలు-20

0
2

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. విశ్వం

నీటి చుక్క
చెమట చుక్క
సిరా చుక్క
పన్నీటి చుక్క
కన్నీటి చుక్క!

~

2. అంతరంగం

వందల ప్రశ్నలు
వేల సమస్యలు
లక్షల చిరాకులు
కోటి గందరగోళాలు
ఉదయించే చోటు
సమాధి అయ్యే ప్రదేశం

~

3. జ్ఞానోదయం

బుద్ధి
బుద్దివంతం
కావడమే!

~

4. వికాసం

బాహ్య దృష్టి
అంతః దృష్టిల
సంయోగమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here