[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. ఆందోళన
రాలిన చినుకు
పర్యావరణానికి
పర్యావరణం ప్రాణికి
మనిషి సాటి మనిషికి
శ్రుతి తప్పిన మానవరాగంలో
గతి తప్పిన స్వార్థ చింతన
లోకమంతా ఆందోళన!
~
2. కల్ల
లోభ ప్రలోభాల
ఊయల
అందమైన రంగుల
వల!
~
3. చీకటి
చూపులన్నీ
చూపుడు వేలి చూపులైతే
జగమంతా చీకటే!
~
4. బాధ్యత
హద్దు దాటిన శత్రువులపై
తూటాల వర్షం
దేశంలో ఆగడాలపై
ప్రశ్నల వర్షం