Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-24

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. గ్రామం

పట్టణాలకు
పట్టం కట్టిన గ్రామం
పట్టణ పునాదుల క్రింద
శిథిలమౌతున్న గ్రామం

~

2. మౌనం

కోటి గందరగోళాలు
శతకోటి సమస్యల
సమాధిపై నిలిచే స్తూపం

~

3. సౌందర్యం

ఆత్మ సౌందర్యాన్ని
ఆత్మభావన మింగేసి
సౌందర్య అర్థం మారిపోయింది

~

4. దుఃఖం

అనవసరమైనది
అవసరమై
అవసరమైనది
అనవసరమైతే
పుట్టేది!

Exit mobile version