[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. మనిషి
సృష్టిలో
ఆహారం కల్తీ చేసుకు తినే
ఏకైక ప్రాణి
~
2. జులాయి కొడుకు
సంస్కారం ఎరుగని తనయునికి
సంపద చేతికొచ్చే..
ఐదేళ్లు గడిచే సరికి
సంపదంతా హారతయ్యే!
~
3. స్త్రీ
కాలం కురుక్షేత్రంలో
నిత్య పరాజిత
తాను ఓడుతూ
మానవ జాతిని గెలిపించే
అపరాజిత!
~
4. కవిత్వం
దట్టంగా కమ్మేసిన
కారుమేఘాలను చీల్చి
విశ్వ ఘోషను చాటుతూ
వర్ణమాల మెరిసింది
కవిత్వం హరివిల్లైంది!