Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-26

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. కొత్త బాట

ప్రాణ హరణానికి
యమపాశం పాత పాట
ధ్వంసమైన రహదారులు
కొత్త బాట!

~

2. వరాలు

నేటి రహదారులపై
ప్రయాణాలు
కార్పొరేట్ వైద్యశాలలకు
వరాలు!

~

3. మోహం

మోహం పాత్రలో
నలుసు కానవచ్చి
కాదనడం అహమే గానీ
మోహం విడనాడడం లేదుగా

భ్రమ తొలగి
నలుసు మాయమైతే
మోహం పాత్రను
మొహమాటమే లేక
పట్టేస్తావుగా..!

~

4. విశ్వ ద్రోహం

మద్యమైతేనేం
మాదకద్రవ్యమైతేనేం
దేశమేమైతేనేం
వాళ్లకు
ద్రవ్యమే ప్రధానం!

Exit mobile version