గోలి మధు మినీ కవితలు-28

0
3

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. ధ్యానం

ఆలోచనలకు బానిసై
కుదురుగా ఓ చోట
కూర్చోవడమనే
ఇష్టం లేని పనిని
మనసుతో చేయించడం!

~

2. దుఃఖం

పండిన తలలన్నీ
తరలిపోతుంటే
తెరలు తెరలుగా
తన్నుకు రావలసిన దుఃఖాన్ని
స్వార్థపు కారుమేఘం కమ్మేస్తుంది

ఇక్కడ దుఃఖమంటే
ఆప్యాయతా పరిమళం కదూ
ఇప్పుడు దుఃఖమంటే
కరడుగట్టిన స్వార్థం కదూ!

~

3. స్నేహితుడు

రక్త సంబంధాల్లేని
ఆత్మ బంధువు!

~

4. సత్యం

మోహపు సౌధం
భ్రమల భవనం
కుప్పకూలాక
మనో శిఖరం చేరేది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here