[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. మనుగడ
పేద కోపం
పదవికి చేటైతెనే
ప్రజాస్వామ్య మనుగడ
~
2. విశ్వం
మట్టి పొరల్లో
మస్తిష్క లోతుల్లో
మది మూలాల్లో
~
3. లేమి
తెలిసిన తీరాన్ని
చేరాలని ఉంది
దారమే లేదు
చేరవలసిన తీరం కాదేమో
~
4. ఔదార్యం
నెమలి సింహాసనం
కోహినూర్ చేరిన చోటికే
నేటి సంపద
స్వ పర భేదాల్లేని
ఔదార్యం