[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. కరిగిపో
కాలం ఒడిలో
కొవ్వొత్తిలా..
కరిగిపో
వెలుగు చూసిన
హృదయాలు
దారులు వేస్తాయి!
~
2. విచ్ఛిన్నం
ఓ
గొంతు
పగిలింది
మరో
మనసు
కుమిలింది!
~
3. ద్రోహం
ప్రశ్న
రాజద్రోహమైతే
ప్రజాస్వామ్యం గుండెల్లో
తూటా దిగినట్లే
~
4. శుద్ధి
బతుకంతా..
పాడుబడిన గూట్లోనేనా
ఇకనైనా గుండె గూటిని
శుద్ధి చేద్దాం!