గోలి మధు మినీ కవితలు-35

0
2

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. అంధత్వం

ఓటు కళ్ళకు
నోటు గంతలు కట్టాక
నోట మాట పడిపోయి
నోటు రాజ్యమేలుతోంది!

~

2. దేవాలయం

సుఖం
భయం
నమ్మకాల
వ్యాపార కూడలి!

~

3. బాధ్యత

బాధ్యతల పునాది మీద
అందమైన ఇంటికోసం
వాళ్ళు

తెలిసి తెలియని
బరువు బాధ్యతల్లో
వీళ్ళు

నాణ్యమైన ఇంటికోసం
ఇంట్లో
ఎన్ని తిప్పలో!

~

4. చోద్యం

నేత చీరకు గిరాకీ
అయినా..
నేత బతుకు గిరికీ
అధినేతల పరాకుకు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here