గోలి మధు మినీ కవితలు-5

0
2

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. తేజం

పడ్డాక
పోయేదేముంది
పుట్టుకొచ్చే
సంకల్పం తప్ప

~

2. బాగు చేద్దాం

రెక్కల కష్టంతో నిండిన
పన్ను గదుల
తేనెతుట్టె వైపుకే వాళ్ల చూపులు
ఒక్కసారి వాళ్ళని కుడితే
బాగుపడదూ దేశం

~

3. సేద్యం

ఓటు
వేట కొడవలైతేనే
ప్రజాస్వామ్యం కళకళ

~

4. వివేకం

వేగు చుక్క
పొడవాల్సింది
తొలి పొద్దులో కాదు
మదిలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here