Site icon Sanchika

గోలి మధు మినీ కవితలు-7

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. కార్పొరేట్

ఇప్పుడు
పేషెంట్లెవ్వరూ లేరు
అంతా కస్టమర్లే

~

2. అభిషేకం

మతం శనికి
మానవత్వంతో అభిషేకం
జరపాలిప్పుడు

~

3. ప్రపంచం

స్వ ప్రయత్నం
అప్రయత్న ప్రయాణం

~

4. పంజరం

ఉచితానుచితాల
పంజరాన
ప్రజాస్వామ్యం చిలుక

Exit mobile version