గోలి మధు మినీ కవితలు-8

0
3

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. దేశం

అప్పులు ఆకలి
రధ చక్రాలపై
నేడు దేశం!

~

2. మతం పాలు

ప్రజాస్వామ్య దేశంలో
పాలన ఆవు
బిడ్డలకు
మతం పాలు పడుతుంది

~

3. ఓటరు

రహదారులన్నీ ధ్వంసం
కళ్ళు మూసిన పాలనకు
ఓటరు
దారి దీపం కావాలిప్పుడు

~

4. ప్రగతి శీలం

ఆకులు రాలిన
దేశం చెట్టుకు
ప్రగతిశీల ఆకులు
మొలిపించు ఓటరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here