Site icon Sanchika

గొంతు గుర్తుపట్టేదాకా…

[dropcap]అ[/dropcap]క్కడే
ఎందుకనో మరి?
గుండె కాసేపు ఆగి కొట్టుకుంటుంది ఎందుకో?

కాళ్ళు వెనక్కు తిరిగి
దారిని అలిగిచూసినట్లు,

చేతులు అద్దాన్ని తాకలేక
లోపలికి ముడుచుకున్నట్లు,

కళ్ళులో మాటోకటి నలకై
చూపును నలిపినట్లు,

మనసు మంకులో మునిగి
ముఖాన్నీనిద్రలో పాతినట్లు,

వాక్యనికి గుండె పగిలి
పదాలు చుట్టలే కొట్టుకున్నట్లు,

నిజాల్ని తొక్కేసిన చీకటిని
నీ నవ్వు వెలుగుతో కడిగి
గొంతు గుర్తుపెట్టి
గౌరవంగా మరో పేజీకి పిలిచేదాక.

నీలో తప్పుకు తిరుగుతాను.
బతుకును నటిస్తూ
నీ చుట్టూ బతికేవుంటాను..

Exit mobile version