గొంతు విప్పిన గువ్వ – 20

28
2

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

స్వేచ్ఛ కోరిన సంస్కృతి…

[dropcap]త[/dropcap]ల్లీకూతుళ్ళు ఒకరిని చూసి ఒకరు అసూయ పడనూ వచ్చు..

అక్కచెల్లెళ్ళు ఏదేని సందర్భంలో స్థితిగతుల తారతమ్యాలతో కుళ్ళుపడనూ వచ్చు…

దీర్ఘకాల స్నేహితురాళ్ళు అనుకోని వైరుధ్యాలతో వైరపడనూ వచ్చు…

జీవిత భాగస్వాముల మధ్య మటుకు అసూయా ద్వేషాలకు అవకాశాలు చాలా అరుదు.

మేరీ థెరిస్సాలు మనసా వాచా కర్మేణా జీవిత భాగస్వాములై సహజీవనం చేస్తున్నారు.

వారిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్…

తొలిసారి థెరిస్సాను చూసిన సందర్భమే మేరీ తనను తాను తెలుసుకున్న సందర్భం కూడా.

ఆనాటి ఆ సంఘటనను మేరీ ఎప్పటికీ మరువలేదు. తనకు పురుషుల పట్ల ఆకర్షణ లేదని తొలిసారిగా ప్రాక్టికల్‌గా తెలిసిన సందర్భం అది…

ఆ రోజున మేరీ పబ్‌లో కూర్చుని వుంది. అప్పుడే మూడో పెగ్గు తాగుతోంది. ఆమె మనసంతా ఆందోళనగా వుంది. తెలియని కలకలం, చెప్పనలవి కాని ఉద్వేగం. పక్కన కూర్చున్న జోసెఫ్ స్పర్ష తనలో ఎటువంటి భావోద్వేగము, రస స్పందన కలిగించక పోవటమే కాకుండా చిత్రంగా చిరాకు కలిగిస్తోంది.

తానేమిటో తనకే అర్థం కావటం లేదు. అర్థం అవుతున్న కొద్దీ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఆ భయాన్ని కప్పి పుచ్చుకోవటానికి తనకు తాను ధైర్యం చెప్పుకోవటానికి పెగ్గు మీద పెగ్గు తాగేస్తోంది. మత్తు ఎక్కే కొద్దీ తన లోని అసలు తను ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కరించటం మొదలయ్యింది.

ఎంతో కాలంగా ఆమెతో స్నేహం చేస్తూ ఆ రోజు డేటింగ్‌కి వచ్చిన జోసెఫ్ తదేకంగా తమకంగా మేరీ మొహంలోకి చూస్తున్నాడు. మధువుతో మెరుస్తున్న ఆమె గులాబీ తడి పెదవులు చూసిన అతను తనను తాను సంబాళించుకోలేక పోతున్నాడు. ఎంత అదుపు చేసుకున్నా వశం తప్పిన అతను అమాంతం మేరీని దగ్గరకు తీసుకుని ఆమె తడి పెదవుల లోని చమ్మను జుర్రుకోసాగాడు. ఆ పెదవుల స్పర్షతో అతని నరనరంలోకీ పాకిన విద్యుత్తు అతని శరీరంలో సన్నటి ప్రకంపనలు కలగ జేసి లోపల కోరికల కుంపటిని రాజేసింది.

పబ్ లోకి వచ్చిన దగ్గర నుండీ మేరీ దృష్టి రెండు టేబుల్స్ అవతల ఒక్కర్తి కూర్చుని వైన్ సిప్ చేస్తున్న థెరిస్సా పైనే వుంది. జోసెఫ్ మేరీ తనువంతా తాకరాని చోట్ల తడుముతూ గట్టిగా నొక్కుతూ తన నాలుకతో, పెదవులతో ఆమె చెవులు, చంపలు, మెడ వంపులు స్పృశిస్తూ మైమరిచిపోతున్నాడు.

అతని చర్యలకు ఏ అలజడికి గురి కాని మేరీ అతని భుజాల మీదుగా థెరిస్సా ఎత్తయిన కుచద్వయాన్ని చూస్తూ ఆమె వెచ్చని వక్షస్థలం పైన తన మొహాన్ని ఊహించుకుంటూ తన్మయంగా కళ్ళు మూసుకుంది.

తీగలు శృతి చేసిన వీణలా ఆమె తనువు అతని వేలి కొసల స్పర్శతో ప్రేమరస సంగీతామృతాన్ని ఒలికిస్తోందని అతను భ్రమ పడుతున్నాడు. మేరీ తన్మయత్వానికి తన మగతనమే కారణమనుకున్న జోసెఫ్ ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తుకుని దగ్గరలోనే వున్న ఏకాంతం లోకి తీసుకెళ్ళాడు.

అప్పటికే ఆరు పెగ్గుల నిషా నషాళానికి ఎక్కిన మేరీ కళ్ళు అరమోడ్పులై కలల లోకాన తేలుతూ ఆపిల్ పళ్ళలాంటి థెరిస్సా బుగ్గలను, ఫిల్లర్స్‌తో పరిమాణం పెంచుకున్న ఆమె దొండపండుల్లాoటి ఎర్రని పెదవులను ఊహించుకుంటూ అపస్మారకంలోకి వెళ్ళిపోయింది.

సుషుప్తిలోకి జారిపోయిన మేరీని జోసెఫ్ ఆసాంతం తన సొంతం చేసుకుని మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఆమెతో రసమయ శృంగార భవితవ్యాన్ని ఊహించుకుంటూ కమ్మని కలల ప్రపంచంలో తేలియాడుతూ తృప్తిగా నిద్రలోకి ఒరిగిపోయాడు.

ఒకే పరుపు పైన ఆదమరిచి పవళించి వున్న, ప్రకృతి సహజ ప్రేమ కాముకుడైన అతనిని, ప్రకృతి విరుద్ద విపరీత వ్యక్తిత్వమున్న ఆమెను, చూసిన చంద్రుడు క్షోభ మనస్కుడై మబ్బుల మాటున మాయమైపోయాడు. వెన్నెల కాంతిని మబ్బులు కమ్మేయటంతో ఆ రాత్రి మరింత చీకటిని కాటుకలా పులుముకుంది.

మేరీ జీవితంలో ఆ రాత్రితో కారు చీకట్లు తొలగిపోయాయి. తనేమిటో తనకేమి కావాలో తేటతెల్లమైపోయింది. ఆ తరువాత ఆమెకు ఆకాశంలో చంద్రునితో అవసరం కలగలేదు. చంద్ర వదనంతో థెరిస్సా వెన్నెల వెలుగును ఆమె జీవితంలోకి తెచ్చింది. జోసెఫ్‌తో మేరీ మనసు విప్పి మదిలో మాట చెప్పింది. అతను సహృదయంతో థెరిస్సాకి ఆహ్వానం పలుకుతూ మేరీ జీవితంలో నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు.

ఆ రోజు ప్రారంభమైన వారిద్దరి సహజీవనం రసరమ్యంగా సాగుతోంది. ఒకరికి ఒకరై, ఇద్దరూ ఒకటై ఏ అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో స్వతంత్రంగా వాళ్ళ ఇంటిని ఒక ప్రేమాలయంగా తీర్చి దిద్దుకుని ఒకే కంచం, ఒకే మంచం, ఒకే మనసు, ఒకే జీవితంలా ప్రాణానికి ప్రాణంగా మసులుకుంటున్నారు. వాళ్ళకు ఒకరిపై ఒకరికున్న ప్రేమ, కోరిక, మక్కువ రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతూ వచ్చాయే కాని వాటికి డెప్రిసియేషన్ సూత్రం అంటలేదు.

ఇప్పుడు వాళ్లది ఇరవై ఏళ్ళ దాంపత్య జీవితం. కాని ఒకరిని చూస్తే మరొకరి కళ్ళల్లో మెరుపులు ఇప్పటికీ మొదటిసారి కలిసినంత ఆర్తిగానూ మురిపెంగానూ వుంటాయి.

వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళిద్దరి స్నేహితుల జీవితాల్లో ఎన్నో స్త్రీ పురుష సంబంధాలు తెగిపోయాయి. ఎన్నో వివాహాలకు విడాకులు అయ్యాయి. వాళ్ళు మటుకు ఒకరి చేతిని ఒకరు వదలలేదు. కలిసి ప్రయాణం ఆపలేదు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టామన్నంత ప్రాణప్రదంగా వుంటారు.

ఎందరో లెస్బియన్ జంటలకు వాళ్ళు ఆదర్శప్రాయమయ్యారు.

ఇంతకీ ఈ ప్రేమ పావురాల కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పనేలేదు కదూ…

మా ఎనిమిదేళ్ళ నిక్కీ స్నేహితురాలు, క్లాస్మేట్ లూసీ సెలవల్లో ప్లే డేట్ కోసం రెండు సార్లు మా ఇంటికి రావటం జరిగింది.

లూసీ చాలా అందమైన, తెలివైన, మంచి మనసున్న ఎనిమిదేళ్ళ అమ్మాయి. మొదటిసారి ఒకావిడ లూసీని దింపి వెళ్ళింది.

‘లూసీ మమ్మీ థెరిస్సా’ అని పరిచయం చేసింది మా అమ్మాయి.

సాయంత్రం మరొక స్త్రీ వచ్చి లూసీని తీసుకెళ్లింది.

ఆమె ఎవరన్న ప్రశ్నకు మళ్ళీ ‘లూసీ మమ్మీ మేరీ’ అని జవాబిచ్చింది మా అమ్మాయి.

భ్రుకుటి ముడి వేసి మా అమ్మాయి వంక చూసా.

అమ్మాయి ఏదో పనిలో బిజీగా వుంది.

ఒకరు కన్న తల్లి, మరొకరు సవితి తల్లి అయ్యుంటారులే అనుకుని నేను ఇక రెట్టించలేదు.

రెండోసారి ప్లే డేట్ కి వచ్చినప్పుడు మూడో స్త్రీ వచ్చింది.

ఆవిడ వెళ్ళిపోయాక “ఈవిడ కూడా మదరేనా…” వేళాకోళంగా నవ్వుతూ అడిగాను మా అమ్మాయిని.

మా అమ్మాయి జవాబు చెప్పే లోపు వెనుక నుండి నిక్కి “యస్ మమ్మ, షీ ఈజ్ జెనెటిక్ మదర్..” అంది.

“మరి క్రితం వచ్చిన వాళ్ళెవరు…” నిజంగానే అమాయకంగా అడిగాను నిక్కీని.

“ఫస్ట్ వన్ ఈజ్ మదర్ హూ గేవ్ బర్త్ అండ్ సెకండ్ వన్ హూ రేస్డ్ లూసీ…” ఆరిందాలా టక్కున విడమర్చి జవాబిచ్చింది ఎనిమిదేళ్ళ నిక్కి.

నోరు వెళ్ళబెట్టి అమ్మాయి వంక చూస్తే “మమ్మీ, క్రితం వచ్చిన ఇద్దరు పార్టనర్స్. కలిసి వుంటారు. వాళ్ళు సంతానం కావాలనుకున్నారు. డోనర్ స్పెర్మ్‌తో ఒక బిడ్డను కనాలనుకున్నారు. దురదృష్టవశాత్తు థెరిస్సాకు అండం ప్రాబ్లం అయ్యింది. ఇవాళ వచ్చిన ఆవిడ అండం తీసుకున్నారు. ఆ అండాన్ని డోనర్ స్పెర్మ్‌తో ఫలదీకరించి థెరిస్సా గర్భంలో పెట్టారు. థెరిస్సాది స్థూలకాయం అవటం వలన మేరీ లూసీని శ్రద్దగా పెంచింది. మూడో ఆవిడ జన్యుపరంగా తల్లి కావటం వలన అప్పుడప్పుడూ వెళ్ళి కలుస్తుంటుంది. ఇవాళ వాళ్ళిద్దరికీ సెలవు లేకపోవటం వలన ఈవిడ వచ్చింది లూసీని తీసుకువెళ్లటానికి…అలా లూసీకి ముగ్గురు అమ్మలు” అంది.

నేను ఎనిమిదో ప్రపంచ వింత విన్నంత విడ్డూరంగా విన్నాను కాని నిక్కీకి ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసట. ఇది ఈ దేశ సంస్కృతికి సర్వసాధారణం కావచ్చు కాని నాకు కాదు.

నా పిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరగటం కూడా నాకు కష్టంగా అనిపించింది.

నిక్కి లూసీ ఇంటికి ప్లే డేట్‌కి వెళితే, ఇద్దరు స్త్రీలను చూడకూడని విధంగా సన్నిహితంగా చూస్తే, దాని చిట్టి బుర్ర పైన ఎలాంటి ప్రభావం పడుతుంది…?

ఆలోచించలేకపోయాను. మా అమ్మాయితో ఒకే మాటన్నాను.

“నిక్కీని మటుకు వాళ్లింటికి ప్లే డేట్ కి పంపకు…”

మా అమ్మాయి కూడా నాతో ఒకే మాటంది.

“మమ్మీ, యు హావ్ టు గ్రో… నువ్వు ఎదగాలి…”

స్వలింగ సంపర్కాలను ఆమోదించి గౌరవించటమే ఎదగటం అనుకుంటే నాకు ఎదగాలని లేదు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here