[dropcap]క[/dropcap]లువరేకుల కాటుక కళ్ళు
స్వచ్ఛంగా వెలిగే దీపాలు..
పలకరించిన హృదయంలో
కాంతులు నింపాలని
ప్రేమ చమరింకేదాకా
వెలుగునే పంచింది..
తాను నుసిరంగుతో
మిగులుతానని తెలిసినా..
చేసిన మేలుని తలవని లోకాన
వెలుగున్నంతవరకే వేడుకని తెలియక
ఆరిపోయిన కంటిపాపదీపంలో
ఇంకా ఏదో ఆశ మళ్ళీ మళ్ళీ
హృదయపు ప్రమిదలో
అనురాగపు నూనె నింపే చేయి
ఆప్యాయతను వెలిగించే మనసు
మరల తనకై వస్తుందని..
చీకటిని వెలుగుతో అలంకరిస్తుందని..
గతమైన అనుభూతులని మరువక
భావితను మళ్ళీ మెరిపిస్తుందని..!!