Site icon Sanchika

గ్రహణం

[dropcap]రా[/dropcap]జకీయాలలో
గెలుపే ముఖ్యమా?
నాయకుల పనితనం
గెలుపులోనే
సాక్షాత్కరిస్తుందా?

ఓటమి చెందిన
నాయకులలో
ప్రజానాయకులు,
ప్రజలకోసం పనిచేసే
సేవకులు లేరా?
హుందా రాజకీయాలు
నడిపిన నాయకులు లేరా??

గెలిచినవాళ్ళలో
నేరచరితులు,
శిక్షార్హులు లేరా??
సమాదానం దొరకని-
ఈ ప్రశ్న వయసు-
కొన్ని దశాభ్దాలు!!

అబద్దాలు బొంకలేక,
అన్యాయాలకు తాళలేక,
నీతిని వదలలేక
నిబద్ధతతో బరిలో
నిలిచిన యోధులది ఓటమి——!!

ప్రజల బలహీనతలతో
తమ పబ్బం గడుపుకుంటూ-
నోటును పంచి-
మధ్యంలో ముంచి,
పొందే విజయం కూడ
గెలుపే—–!!

నైతికతలేని గెలుపది,
అమాయకుల ఆసరాతో
వరించిన విజయమది.
విలువలనూ తుంగలో
త్రొక్కి ఆక్రమించిన
ఆసనమది!!

ఎన్నో శాసనాలకు
చట్టబద్దత కల్పించి,
ఎందరో మహానుభావులు
ఆసీనులై
ప్రజారంజకంగా
పాలించిన సభలలో
ఇలాంటి విజేతలకు ప్రవేశం-
ప్రజాస్వామ్యానికే
పట్టిన గ్రహణం!!

Exit mobile version