Site icon Sanchika

గుంత

[dropcap]“న[/dropcap]న్ని ఆ దేవుడు పుట్టిచ్చె….. నా మూలము అబ్బా అమ్మా….
నా ఆది అంతము అంతా ఆ దేవాది దేవునిదే … ఇట్లా మాటలు
యినియిని నాకి సాలయిందినా, దాన్నింకా సులువుగా నా బుర్రకి
తట్టేనట్ల మనము ఏడనింకా బూలోకానికి వస్తిమి ఏడకి
పోతాము అనేది రవంత చెప్పునా?” అంటా అదో మాద్రిగా
అన్నని చూస్తా అంట్ని.

“వచ్చిన తావకే పోతామురా” ఇంగో మాద్రిగా అనె అన్న.

ఆ మాట యింటానే నాకి ఎట్లేట్లో అయిపొయ, అట్లట్లే ఎగాదిగా
అన్నని చూస్తిని. ఆ చూపుకి అన్న అదిరిపాయినట్లుండాడు.

“అట్లేలరా చూస్తావు రవంత తాంశము కారా, మనిషి సచ్చినంక
ఏడ పూడ్సిపెడతారు” అనె.

“ఇంగేడ గుంతలా” అంట్ని.

“కదా… మనిషి వచ్చింది కూడా ఆ గుంతలా నింకానే…
ఏడనింకానో రాలే ఏడకి పొయ్యేలే పోయి పనిసూడిపొ రా” అని
చెప్పి ఎగురుకొంటా ఎల్లీశా అన్న.


గుంత = గొయ్యి
ఎగాదిగా = కిందా మీదా లేదా అదేపనిగా
తాంశము = శాంతం

Exit mobile version