[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘గురు బ్రహ్మ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప[/dropcap]లకా బలపం పట్టించి
ఓనమాలు దిద్దించి
అక్షరాలు నేర్పించి
మాతృభాషను నేర్పించి
బహు భాషలు చదివించి
శాస్త్ర జ్ఞానం కలిగించి
నైతిక విలువలు కలిగించి
జీవిత ధ్యేయం ఎరిగించి
బుధ్ధి వికాసం కలిగించి
బాధ్యతలను నేర్పించి
మంచి పౌరులుగ మలిచి
దేశ ప్రగతికి బాటలు వేసి
శిశువుని శివునిగ మలచి
మహోన్నతునిగ గావించి
ప్రతిఫలమేది ఆశించక
ఆశయమే ఊపిరిగా పీల్చే
ఉపాధ్యాయుడు ధీరుడు
సంఘ శిల్పాన్ని చెక్కిన శిల్పి
గురు ఋణం తీరదెప్పుడూ
వందనమే మనమిచ్చుకొనే
గురు చంద్రునికి నూలుపోగు
ఉపాధ్యాయ దినోత్సవం నాడు
గురువులందరికి వేనవేల వందనాలు