Site icon Sanchika

గురువంటే

[dropcap]గు[/dropcap]రువంటే జ్ఞానదీప్తి – ఆ
గురువంటే క్రాంతదర్శి
బ్రతుకు బాట నిర్మించే మహావ్యక్తి
వెలుగు దారి చూపించే మహోన్నత శక్తి ॥గురు॥

అక్షరాలు దిద్దించే అమృత హస్తాలు
లక్ష్యానికి దరి చేర్చే కమ్మని వాక్కులు
శిష్యుల శ్రేయస్సే పరమావధిగా
ప్రతిఫలం ఆశించక దీవించే మనసు ॥గురు॥

ఆత్మ విమోచన కలిగించువాడు
జీవన్ముక్తిని ప్రసాదించువాడు
సత్య బోధకుడు, సత్వ సాధకుడు
నిత్య పరిశోధకుడు గురువంటే ॥గురు॥

దివ్యానంద రసామృత పూరితుడై
మూర్తీభవించిన విజ్ఞాన ఖనియై
భావాతీతుడై, గుణాతీతుడై
సర్వాతీతుడైన వాడె గురువంటే ॥గురు॥

Exit mobile version