హెరియట్ అనేనా రెండు కవితలు

0
3

[వర్తమాన ఆఫ్రికన్ కవయిత్రుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో ఆఫ్రికా లోని ఉగాండాకి చెందిన హెరియట్ అనేనా రచించిన ‘I Died Alive’, ‘A Nation is in Labour!’ అనే రెండు కవితలని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి.] {‘I Died Alive’ and ‘A Nation is in Labour!’ – Two poems by Harriet Anena, African-UGANDA Poetess. Telugu translation -Githanjali -India}

1.నేను ప్రాణంతోనే మరణించాను! {1}I Died Alive

————————-

నేను చనిపోయాను.
కానీ నా హృదయం ఇంకా కొట్టుకుంటూనే ఉంది!

నేను మూగ దాన్ని అయ్యాను.
కానీ నేను చెప్పాలనుకున్న మాటలు
నా లోపల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి!
నేను గుడ్డి దాన్ని కూడా అయ్యాను.
కానీ.. నా అంతఃనేత్రం మాత్రం
బయటి ప్రపంచాన్ని చూస్తూనే ఉంది!

నేను అచేతనంగా పడి ఉన్నాను.
కానీ.. చురుకైన నా కలలు మాత్రం
నన్ను మైళ్ళ దూరాలకు తీసుకుని వెళ్లాయి!
నిజం.. నేను చనిపోయాను.
కానీ.. గుర్తు పెట్టుకోండి.. ప్రాణంతోనే మరణించాను!

***

2} జాతి ప్రసవ వేదనలో ఉంది! {2} A Nation is in Labour!

————————-

ఈ రోజు గణతంత్రం ప్రసవ వేదన పడుతోంది!
నొప్పి భరించలేక అరుస్తోంది.
బిడ్డని బయటకు తొయ్యమని తనకి చెప్తున్న.,
వలసవాద మంత్రసానిని శపిస్తూ..
గణతంత్రం బాధతో ఘుర్నిల్లుతున్నది!
ఆమె తల గిరా గిరా తిరుగుతున్నది.
చూపు మసక బారింది
మనసు అతలాకుతలం అయింది.
ఇక ఆమె ఏం చేస్తుంది?
ఆమె ఓ కప్పు నకిలీ నైతికతని తాగేసింది.
చివరికి మృత శిశువు పుట్టినందుకు
మొద్దుబారిపోతూ.. నిస్పృహతో.. కొద్ది ఆశతో మౌనంగా ప్రార్థిస్తుంది.
**
నిజానికి ఈ గణతంత్రం
ప్రసవ వేదనతో చెకుముకి పిట్టలా
తప తపా కొట్టుకునే తలలేని రెక్కల కోడిపిల్ల లాంటిది.
నెలలు నిండకుండా పుట్టించినందుకు
ఆమె ఆగ్రహంతో భవిష్యతుని శపిస్తుంది.
మ్రోగ లేని పాత కాలపు తాతగారి
గోడ గడియారానికి అంటి పెట్టుకుని వేలాడుతున్నందుకు
యమ విసుక్కుంటుంది కూడా!
ఏమో.. ఇది వంకరగా ఉన్న భవిష్యత్తుని సరి చేస్తుందేమో
అని కూడా కొద్దిగా ఆశ పడుతుందేమో.. ఏమో..?

~

మూలం: హెరియట్ అనేనా-ఉగాండా కవయిత్రి

అనువాదం -గీతాంజలి


హెరియట్ అనేనా సాహిత్య & సామాజిక జీవితం

32 ఏళ్ల హెరియట్ అనేనా ఉగాండా రచయత్రి. ఆర్ట్స్ & హ్యూమన్ రైట్స్ లో మాస్టర్స్ చేశారు. కవిత్వం, ఫిక్షన్, నాన్-ఫిక్షన్ లో రచనలు చేశారు. ఏ నేషన్ ఇన్ లేబర్ అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు (2015).

ప్రతిష్ఠాత్మకమైన Wole soyanka prize for Literature in Africa ,అవార్డుని అందుకున్నారు.The Economist పత్రిక హెరియట్ కవిత్వాన్ని “An arresting evocation of Love & War” గా వర్ణించారు.

అనేనా ఉగాండా కో లార్డ్స్ రెసిస్టన్స్ ఆర్మి చేసిన యుద్ధ కాలంలో జన్మించారు కాబట్టి చాలా చిన్నవయసులోనే యుద్ధ ప్రభావం మానవ జీవితాన్ని అతలాకుతలం చేయడం గమనించారు. అదే తరువాత ఆమె కవితా వస్తువు అయింది.

అనేనా జర్నలిస్ట్ గా అనేక పత్రికల్లో పనిచేశారు.

హెరియట్ అనేనా కవితలు

Forgiveness, we Arise, A thousand voices rising, An anthology of contemporary African Poetry, sharing my man with a country. I died Alive,

హెరియట్ అనేనా కథలు

The Satan’s inside my jimmy., Dancing with ma., Waiting., The Dogs are hungry., The Axe., And many articles.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here