హాస్య తరంగిణి-3

2
1

[dropcap]జ[/dropcap]న్మించిన దగ్గర నుండీ నిత్యం మనల్ని అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని పనులు ఎన్నిసార్లు ప్రయత్నించినా పూర్తికావు. కానీ కొన్ని పనులు మాత్రం అప్రయత్నంగానే కలసి వస్తాయి. అలాగే విజయవంతమౌతాయి కూడా. అలాంటప్పుడు మనం విసిగిపోకూడదు. నిరసించిపోరాదు.

ఏది ఏమైనా అర్థంకాని జీవితం గురించి అతిగా ఆలోచించటం, తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం వ్యర్థమే కదా మరి! మనలో ఉత్సాహం ఉరుకులు, పరుగులు తీయాలంటే జోకులు, చలోక్తులు చదివి తీరాలి మరి! ఈ తరుణంలోనే బ్రహ్మానందంతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం కోసం తక్షణమే మనకు ‘హాస్య తరంగిణి’ అమృతంవలే పనిచేస్తుంది. ‘హాస్యం అమృతం విచారం విషం’. ఈ అమృతాన్ని మీరు సేవించి, అందరికీ పంచండి.

21. పై పెచ్చులు

మంత్రి: ఇదేమిటయ్యా! నేను అడుగు పెట్టిన ప్రతి భవనంలో పైనుండి పెచ్చులూడి నా మీద పడుతున్నాయి?

సెగట్రీ: మీరు మాట మాటకి పై పెచ్చు, పై పెచ్చు అని తరచుగా ప్రసంగిస్తున్నారు కదండీ! అందుకే పై పెచ్చులు..

22. సమ్మె సైరన్

అమాయక్: సార్! మా కోసం ప్రత్యేకంగా ఒక సైరన్ వెంటనే ఏర్పాటు చేయండి.

మేనేజర్: కార్మికులకూ, సిబ్బందికీ కలిపి ఒక సైరన్ ఉందిగా! ఇంకొకటెందుకు?

అమాయక్: మేము సమ్మె సైరన్ మ్రోగించాలి కదా అందుకని!

23. విస్తరి

లంబు: ఒరేయ్ జంబూ! జీవితం వడ్డించిన విస్తరి కాదురా.

జంబు: ఓహో అలాగా! మరేంటి? పారేసిన విస్తరా?

24. వెంగళప్ప

వెంగళప్ప: ఈ టివి ఖరీదు ఎంత?

షాప్ వాడు: ఈ టివి నీకు అమ్మను.

వెంగళప్ప: (మళ్ళీ మారు వేషంలో వచ్చాడు)

ఈ టివి నాకు కావాలి దీని రేటు ఎంత?

షాప్ వాడు: ఈ టివిని నీకు అమ్మనని చెప్పానుగా!

వెంగళపప్ప: (మళ్ళీ ఇంకొక మారువేషంలో వచ్చి)

ఈ టీవీని నేను ఎంత రేటైనా కొంటాను. దీని రేటు ఎంత?

షాప్ వాడు: ఈటివిని నేను నీలాంటి వెంగళప్పకు అమ్మను.

వెంగళప్ప: నేను మూడు రకాల వేషాలలో వచ్చినా కూడా గుర్తుపట్టావు? నా పేరు ఎలా తెలుసుకున్నావు?

షాప్ వాడు: ఇది టివి కాదు నాయనా! ఓవెన్. అందుకే తెలుసుకున్నాను. నువ్వే వెంగళప్పవని!

25. అర్థం కావు

కళ్యాణ్: ఆ శరత్ గాడు ఏ విషయం గురించి చెప్పినా మనకు అసలు అర్థం కాదేమిటిరా?

సునీల్: వాడు యూ ట్యూబ్ లో వీడియోలు చేస్తాడుగా! అంతే!

26. ఐశ్వర్య ప్రాప్తిరస్తు

తండ్రి: ఎవరు రా ఈ అమ్మాయి? ఏకంగా ఇంటికీ తీసుకొచ్చావు?

కొడుకు: నాన్నా మీరు రోజూ నన్ను ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవించారుగా! ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాను. మమ్మల్ని దీవించండి!

27. నేనే గొప్ప

లంబు : ఒరేయ్ జంబూ! ఏనుగు మూడుమైళ్ల దూరంలో వున్న నీళ్లను పసిగట్టి, నీళ్లను త్రాగుతుంది! ఎంత గొప్పో కదా!

జంబూ:  నేను కూడా ఏనుగు కన్నా గొప్ప తెలుసా!

లంబు: ఎలాగ?

జంబు: నాలుగుమైళ్ల దూరంలో వున్న వైన్ షాప్ ని పసిగట్టి మందుకొడతాను తెలుసా?

28. ప్లాస్టిక్ కండువా

రాము : అదేమిటి రా ప్లాస్టిక్ కండువా వేసుకున్నావు?

కృష్ణ: ఇది హైటెక్ కండువా నా దగ్గర వున్న ఐడెంటీ కార్డులన్నీ దండగా వేసుకొని ఏది అవసరమైతే దాన్ని చూపెట్టడానికి!

29. బిగింపు

నాయకుడు: ఏమయ్యా! ఎన్నికలు వస్తున్నాయి కదా! మరి ప్రచారానికి నడుం బిగించాలి?

కార్యకర్త: మీరు అడుగుతారనే, నేను ఎప్పుడో బిగించేశాను.

నాయకుడు: ఇంతకీ ఎలా బిగించావ్?

కార్యకర్త: ఊగిపోయే నా పంచెను. జారిపోకుండా బెల్ట్ వేసి గట్టిగా బిగించేశా.

30. టికెట్

భద్రయ్య: నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటం అన్యాయం?

భుజంగం: నీకు టికెట్ ఇచ్చేవాడినే! కానీ ప్రింటింగ్ ప్రెస్ వాడు ఇంకా టికెట్లు ఇవ్వలేదు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here