[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.
11. నమ్మకం
అజయ్: ఏంటిరా? అసలు నీకు పేకాట ఆడడమే రాదు కదా! మరి లక్ష రూపాయలు పేకాటలో ఎలా పోగొట్టుకున్నావ్?
విజయ్: ఆ లింగయ్య బాగా ఆడిపెడతానంటే వాడి చేత ఆడించాను! ఇప్పుడు సింగిల్ టీ కి కూడా రూపాయ లేదు.
12. సుస్తీ
గురువు: శిష్యా! సంగీత కచేరిలో ఎందుకని ఇద్దరు పాడుతూ ఉంటారు?
శిష్యుడు: ఒకరికి సుస్తీ చేస్తే ఇంకొకరు పాడొచ్చని! అదే, విమానంలో కో-పైలట్ లాగా.
13. మిళితం
అధ్యాపకుడు: అదేమిటయ్యా! గోచీ పెట్టుకొని టై కట్టుకొని కాలేజీ కొచ్చావ్?
తిరకాసు: మీరే కదండీ స్వదేశీ, విదేశీ నాగరికతలు మిళితమైన దుస్తులు ధరించి రమ్మని చెప్పారు!
14. తిరుగుబాటు
నాయకుడు: అదేమిటయ్యా? మన పార్టీ జెండాల మీద తిరుగుబాటు అని వ్రాశావు?
కార్యకర్త: మనం వెంటనే తిరుగుబాటు బావుటా ఎగరవేయాలని మీటింగ్‍లో మీరే చెప్పారు కదా!
15. వాణి సిస్టర్స్
టీచర్: దూరవాణి, సంచారవాణి గూర్చి ఎవరైనా వివరించండి?
హరికృష్ణ: వాళ్ళిద్దరూ మా మావయ్యగారి అమ్మాయిలు సార్!
16. దీపం
భార్య: అదేమిటందీ? ఈ రోజు మరీ ఆనందంగా వున్నారు?
భర్త: మన కాబోయే కోడలు ముఖాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చని నువ్వు పెళ్ళిచూపుల్లో చెప్పినందుకు.
భార్య: మీరు అసలు విషయం చెప్పండి! మతలబ్ లేకుండా ఏ పనీ చెయ్యరు కదా!
భర్త: మరి కోడలు దీపమైనపుడు మనకు కరెంట్ చార్జీలు వుండవు కదా మరి!
17. సన్నాయి నొక్కులు
నాయకుడు: ఇదేంటయ్యా, పార్టీ ఆఫీసుకు సన్నాయి తీసుకొచ్చావూ?
కార్యకర్త: అప్పుడప్పుడూ మనం కూడా సన్నాయి నొక్కులు నొక్కి వినిపించాలని నిన్న మీటింగ్‍లో మీరే చెప్పారు కదా సార్!
18. టాకింగ్ టాక్స్
అసిస్టెంట్: ఇదిగో టాక్స్ బిల్ తీసుకోండి. వెంటనే టాకింగ్ టాక్స్ కట్టండి.
దానయ్య: నేనెందుకు కట్టాలి?
అసిస్టెంట్: మీరు ఎక్కువగా మాట్లాడినందుకు.
దానయ్య: మరి తక్కువగా మాట్లాడితే టాక్స్ ఉండదా?
అసిస్టెంట్: తక్కువ మాట్లాడినా బిల్ కట్టాలి. ఇది కూడా బి.పి. లాంటిదే! వెంటనే కట్టండి.
19. చూడకండి
యాంకర్: మీ సినిమాకి భారీ కలెక్షన్లు రావడానికి కారణాలు చెపుతారా?
నిర్మాత: సినిమా చెత్తగా తీశాం! చూస్తే చూడండి లేకపోతే లేదు అని చెప్పాం. అంతే! సినిమాలో ఏముందోనని అందరూ చూశారు.
20. గబగబా అనండి
Gold Slice – Old Spice
(మళ్ళీ కలుద్దాం)