Site icon Sanchika

హీరోలం మేము నేటి హీరోలం!

[dropcap]హీ[/dropcap]రోలం మేము హీరోలం మా గురించి నిజం చెబుతాం
మాతో చేయి కలిపితే అభిమానిస్తాం వ్యతిరేకిస్తే మా సంగతి చెబుతాం
మేము కాలేజీలో చేరేముందు అనుకుంటాం ఇలా
అనుభవాల లోగిళ్ళు… ఆనందాల పరవళ్లు
ఆదర్శాలకు పునాదులు వేసిన అధ్యాపకులు
ఆటలతోపాటలతో అలరించిన నేస్తాలు
అరమరికలులేని అంతస్తులు లేని సమైక్య సోదర భావాలూ
అతివిలువైన జ్ఙాన సముపార్జనకు పునాదులు
అల్లరిలో హనుమంతులం ఆదర్శాలు వల్లించే హీరోలం
చదువునేర్పిన కాలేజీలు పిరికితనాన్ని పోగొట్టిన పాఠాలు
పరీక్షలు డిగ్రీలకేకాదు జీవిత సమస్యలకు పరిష్కారాలని తెలియచెబుతాయి
యువనాయకత్వపోటీ రాబోయే రాజకీయ ప్రవేశానికి వేదికగా కాలేజీ ఎన్నికలు
హీరోయిజానికి ఖరీదైన బైకులు లేటెస్ట్ స్మార్ట్‌ఫోనులే గీటురాళ్ళుగా నమ్మినవాళ్ళం
సినిమా మొదటి షోకి సిన్సియర్‌గా హాజరయ్యే అభిమాన నటుల ఫ్యానులం
పాఠాలు అర్థంకాక క్లాసులకు హాజరుకాక పరీక్షల్లో పాసుమార్కులురాని జీరోలం
పరీక్ష ఫెయిలైతే మాస్టార్ని మార్చాలని సమ్మె చేస్తాం రాత పరీక్షలు వద్దంటాం
క్రికెట్ సినిమాకబుర్లు క్లాసులో అమ్మాయిల అడ్రస్సులు అడగండి….నో డౌట్
ఇంటి దగ్గిర ఎవరిమాటా వినం క్లాసులో అమ్మాయిలు ఏదిఅడిగినా కాదనం
హీరోలా వున్నావంటే వాళ్ళకి దాసోహం అవుతాం
నిజంచెబితే వాళ్ళ అంతు చూస్తాం
ప్రేమంటే తెలియని వయసులో అమ్మాయిలకు ప్రేమలేఖలు మెస్సేజ్ పెట్టిన ఘనులం

Exit mobile version