అమెరికాలో అన్నీ వదిలి, హౌస్టన్ నుండి ఎప్పటికప్పుడు నా భారతావనికి తిరిగి వచ్చేద్దామా అని అనుకున్నప్పుడు నా గుండె దడ గుర్తుకొస్తుంది.
తిరిగి వద్దామనుకున్న ప్రతిసారి నన్ను నేను ఆపుకోవలసి వచ్చింది, ఎందుకంటే నేను సరిపెట్టుకోగల వ్యవహారాలు, చూసుకోవలసిన పనులు చాలా వుండేవి. ఒక పద్ధతి ప్రకారం భారత్‌కు తిరిగి రావాలి అని నిర్ణయించుకున్నాను.
తిరిగి వెళ్లాలని ఉద్రేకపు చెందినప్పుడు స్వదేశ్ చిత్రం లోని ‘యే జో దేశ్ హై తేరా, స్వదేశ్ హై తేరా, తుజే హై పుకారా’ పాటలు స్వాంతన చేకూర్చేవి.
కోవిడ్ లాక్‌డౌన్, విమానపు రద్దుల వల్ల 2020 మరియు 2021లో రాలేక పోయినా, ఆఖరికి ఇరవై ఒక్క ఏళ్ళు అమెరికా జీవనం తరువాత ఇంటికి తిరిగి వచ్చాము.
నా నిర్ణయానికి తోడు నిలిచిన వారు నన్ను ప్రోత్సహించి, మేము సుఖంగా వెళ్ళడానికి, ఇక్కడ సర్దుకోవడానికి వాళ్ళు ఏ సహాయం చెయ్యగలరో అడిగారు. నేను అందరి సలహాలు సంప్రదింపులు విని వాటికి విలువ ఇచ్చాను.
2020లో మిత్రులందరికి తిరిగి వెడతాను అని చెప్పినా, నా నిర్ణయం 2014 లోనే అయిపోయింది. నిజానికి 2001లో అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడే ఉండిపోవాలని అని నేను అనుకోలేదు. నేను అడుగు పెట్టిన అమెరికాకి , విడిచి వచ్చిన అమెరికాకి మధ్య చాలా తేడా ఉంది.
అది గమనించే అవకాశం నాకు 2001లో దిగిన కొద్ది రోజులకే కలిగింది. నేను ఆమెరికాలో అడుగు పెట్టిన నెల రోజులకే ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై, పెంటగాన్‌పై దాడి చేశారు, 11 సెప్టెంబర్, 2001 సంఘటన జరిగింది.
నిద్రపోతున్న ఒక దిగ్గజ దేశం లెగిసి రెండు దశాబ్దాలు ఉగ్రవాదంపై దాడి చేసి, చివరికి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. నేను ఒక శక్తివంతమైన దేశాన్ని ఒక ఉన్నత స్థితి నుండి క్రమ క్రమంగా కరోనాని ఎదుర్కోలేని, రష్యాని నిలువరించలేని, చైనాను అదుపులో పెట్టుకోలేని, చివరికి ఉగ్రవాదులను ఎదుర్కోలేని దేశంగా మారటం చూసాను.
అమెరికా నెమ్మదిగా దిగజారడం మొదలు పెట్టింది, కావాలని కాదు, కాని అహంకారం ఎక్కువై.
అమెరికాలో సామాన్య మానవులు ప్రతీ చోట కష్టపడుతూ, సంతోషాన్ని వెదుకుతూ ఉన్నారు. కాని 10% ఉన్నత వర్గంగా భావించే ‘డీప్ స్టేట్’ వాళ్ళు తమ డబ్బు, పరపతి వాడి, మీడియా, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ మరియు ప్రభుత్వ రంగాల్ని శాసించడం మొదలు పెట్టారు.
వారు చేసే ప్రతీది ప్రజలను నియంత్రించడం వైపే. సామాన్య ప్రజలకు మీరు అన్నీ దేశాలకన్న మంచి దేశంలో ఉన్నారు అని చెప్పి, వేరే దేశస్తులు బీదవారని, లంచగొండులని చెప్పసాగారు.
ఈ 20 సంవత్సరాలలో భారతదేశం నిద్ర నుండి మెల్లిగా బయటకు రావడం మొదలు పెట్టింది. అదృష్టవశాత్తు పి వి నరసింహ రావు గారు, అటల్ బిహారీ వాజపేయి గారు, నరేంద్ర మోడీ గారు మన దేశ గొప్పదనం పెంపొందించి వెయ్యేళ్ళ బానిసత్వం, కమ్యునిజం, ఉగ్రవాదం నుండి మన దేశాన్ని బయటకు లాగాలని శ్రమిస్తున్నారు.
తిరిగి వద్దామని అనుకున్నప్పుడు చాలా సందిగ్ధత వుండేది. చూస్తూ చూస్తూ ఉండి ఒక దిగజారుతున్న దేశంలో ఉండాలా, లేక ఇప్పుడిదే బానిసత్వం మనస్తత్వాన్ని తెంపుకొని అద్భుత ప్రగతి వైపు ఎదుగుతున్న మన భారతావనికి వచ్చేయ్యాలా?
చివరికి నా మనస్సాక్షి ‘ఘర్ వాప్సి’ అంది. నా మనసు నా హృదయం లోని మాట విన్నందుకు ఈ రోజు నేను సంతోష పడుతున్నాను.