Site icon Sanchika

ఇదే ఇదే యుగాది

[dropcap]ఇ[/dropcap]దే ఇదే యుగాది ఉగాది
ఉదయ ఉషస్సుల కాంతుల ఉగాది.
తెలుగు ప్రజలు కోట్లాది
కోరుతున్న కొత్త వెలుగుల ఉగాది. (ఇదే॥)

మమతల క్షమలత మమకారం
మనుషుల మనుగడ నుడికారం
నూతన సంవత్సర గమనానికి శ్రీకారం
సమతకు మమతలు మహా ప్రాకారం. (ఇదే॥)

క్రొత్తదనానికి ఒరవడి, ఉగాది
క్రొత్త వెలుగుల పరవడి దిశాది.
ఇదే ఇదే  యుగాది ఉగాది
ఉదయ ఉషస్సుల కాంతుల ఉగాది.

ఆబాల గోపాలుర కలకలారావాలు
ఆనంద తరంగాల సోయగాలు
చైత్ర  మాసాన వినూత్న అంకురాలు
కోయళ్ళ కూ కూ కమ్మని రాగాలు
ఉదయకాంతుల ఉగాది
వెదజల్లును జగాది. (ఇదే॥)

పులుపు, చేదు, తీపి, వగరుల
పసందైన ఉగాది పచ్చడిలా
బహుజాతుల మతాల చిహ్నాలు
స్నేహానికి సాంకేతం కావాలి. (ఇదే॥)

తీపి నిలుపు స్నేహానికి
చేదు చూపును కరుకుదనానికి
వగరు నిలుపు పొగరు తనానికి
పులుపు సూచించు చురుకు దనానికి
నాల్గు రుచుల సమ్మేళనమే
నాంది పలుకును సమతా భావానికి. (ఇదే॥)

Exit mobile version