Site icon Sanchika

ఇదేకదా జీవితం

[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘ఇదేకదా జీవితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]జీ[/dropcap]వితం నలుగోడల
మద్య జననం
నలుగురితో పయనం
అక్షరాల అభ్యాసం
అదేకదా బాల్యం

నాలుగంచెల పఠనం
మేధస్సుని పెంచే
విషయ పరిజ్ఞానం
ఆటపాటలతో వినోదం
స్నేహితులతో కాలక్షేపం
ఇదేకదా యవ్వనం

గెలుపు ఓటముల సమరం
ఊహల ఆశల సమీరం
తనమన ఎవరో అధ్యయనం
మనోభావాల భావోద్వేగాల
మిశ్రమం మధ్యస్థం

కష్ట సుఖాల సమాహారం
ఆరోగ్యమే మహా భాగ్యం
అనిపించే వృద్ధాప్యం
ఇదేకదా జీవితం

Exit mobile version