Site icon Sanchika

ఇదేనా మన సంప్రదాయ మిదేనా?

[dropcap]ప[/dropcap]ర దేశ స్త్రీలు మన దేశ
సంప్రదాయాలను ఆచరిస్తుంటే,
బొట్టూ కాటుక చీర కట్టుతో
సింగారంగా కనువిందు చేస్తుంటే,
భారత దేశ సంప్రదాయాలకు
కళలకు జై జై లు కొడుతుంటే…

మన దేశ వనితల కొందరు నుదుటి బొట్టు
మరచి ఫ్యాషన్ పేరుతో, జుట్టు
విరబోసుకొని తిరుగుతుంటే,
చీర కట్టుని, తాళిబొట్టుని పక్కన పెట్టి
కురచ దుస్తులు వేసుకొని
తిరుగుతుంటే, ఇది మన దేశ
నాగరికత అనిపిస్తుందా?

ఆడా, మగా, తల్లీ కూతుర్లు
ఎవరో తెలియని దుస్థితి,
చిరుగు పెట్టిన జీన్స్ వేసుకొని
వీధుల వెంట తిరుగుతుంటే
వీది కుక్కలు తరుముకొనేలా
బిచ్చగాళ్ల నవ్వుకొనేలా
దిగజారుతుంది మన యువత…

కర్మభూమికి పట్టిన ఈ కర్మను
ఎవరు నిర్మూలించ గలరు.
చిరుగు జీన్స్‌ని విడిచిపెట్టి
మంచి బట్టలు ధరించండి,
మీలో చైతన్యము కలిగి,
భరతమాత బిడ్డలుగా
మెలగండి, కన్న వారికి
జన్మభూమికి తలవంపులు తేకండి.

నేటి పిల్లలే యువతనే
భావి భారత పౌరులని
గ్రహించండి, అమ్మ నాన్నల
మాటలకు విలువనివ్వండి

తల్లితండ్రులారా మీ బిడ్డలకు
మంచి నడత నేర్పండి.
మన దేశ గౌరవాన్ని నిలపండి,
చెడు వ్యాసనాలకు బానిసలు కాకండి.
చిరిగిన జీన్స్, తాగుడు, పొగ, పబ్బులు
దరిద్రమని తెలుసుకోండి,
“ఇదేనా మన సంప్రదాయం
ఇదేనా” అని భరత మాత
కన్నీ రొలికే రోజు రానీకండి.

“జై భారత్ మాతా”
“జై హింద్”.

Exit mobile version