ఇది నా కలం-13 : వడ్డాది రవికాంత్ శర్మ

4
2

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

వడ్డాది రవికాంత్ శర్మ

[dropcap]న[/dropcap]మస్కారం!

నా పేరు వడ్డాది రవికాంత్ శర్మ. తెలుగు సాహిత్యం ఐచ్చిక అంశంగా, సివిల్ సర్వీసెస్ పరీక్షలకి సిద్ధం అయ్యే విద్యార్థిని నేను. కెమికల్ ఇంజనీర్‌గా నూజివీడు ఐఐటి నుండి పట్టా పుచ్చుకున్నప్పటికీ, పౌర సేవపై ఆసక్తితో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. చిన్నప్పటినుండి, ఇంట్లో, పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ స్థాయిల్లో గురువుల ప్రోత్సాహం వల్ల సాహిత్యంలో ఉన్న అభిరుచి, జ్ఞానం రోజు రోజుకి పెంచుకుంటూనే ఉన్నాను.

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల పుస్తకం నాకు ‘ఆల్ టైం గ్రేట్’ అని పిలవాలనిపించే పుస్తకం. శ్రీశ్రీ మహా ప్రస్థానం, కృష్ణశాస్త్రి కృష్ణ పక్షంతో పాటు, దాశరథి, కాళోజి రాసే కవిత్వాలు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి ‘అమృతం కురిసిన రాత్రి’ నాకు నచ్చే చాల పుస్తకాల్లో కొన్ని.

పాఠశాల రోజుల్లో జాతీయ స్థాయి బాలోత్సవ్‌లో కథా రచన, చిత్ర విశ్లేషణ కవితల్లో ప్రథమ బహుమతితో పాటు, విశ్వవిద్యాలయ స్థాయిలో చాలా పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. కరోనా లాక్‌డౌన్ సమయంలో సాహిత్య పోటీల సమయం, అవకాశాలు పెరిగాయి. ‘భారతమాత రక్షణలో మన బాధ్యత’, ‘నా మదిలో మెరిసిన తెలంగాణ’, ‘నాన్న’ మొదలైన దాదాపు ఇరవై కవితా సంకలనాలల్లో నా కవితలు అచ్చువేశారు. తానా వారి ‘భువన విజయం’ లాంటి కార్యక్రమాల్లో ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను. ప్రపంచ పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, తెలంగాణ గవర్నర్ ఆఫీస్, ప్రపంచ సాంఘిక మరియు సాంస్కృతిక సంస్థ లాంటి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన సాహిత్య, సాహిత్య సంబంధ పోటీల్లో పాల్గొని గెలవడం జరిగింది.

జాతీయవాద కవిత్వం, సాంస్కృతిక సాహిత్యం, తెలుగు జాతి విలువ పెంచే కథలు, వ్యాసాలు, భిన్న సాహితి ప్రక్రియల్ని నిరంతరం అధ్యయనం చేస్తూ, సాంకేతిక ఫలాలని సాహిత్యంలో చొప్పించి కొత్తరకం రక్తాన్ని తెలుగు సాహిత్యానికి అందించాలని తపనలో ఉన్నాను.

ravikanthsharma9@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here