Site icon Sanchika

ఇది నా కలం-16 : సుభాషిణి ప్రత్తిపాటి

ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు.

సుభాషిణి ప్రత్తిపాటి

నమస్తే. నా పేరు సుభాషిణి ప్రత్తిపాటి.

నేను తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను.

కవిత్వం ఎందుకు వ్రాస్తున్నానో చెప్పమంటే…

మనసు సంతోషాన్నో, వేదననో, దుఃఖాన్నో పంచుకునే ఏకైక నేస్తం అక్షరం కనుక.

ఏ బస్ లోనో వెళుతుండగా కాలేజీ బయట అకాలమరణం పొందిన బిడ్డ ఫోటో చూసి కన్నీళ్ళతోనో, ఆటోలో నా ముందు కూర్చుని ఒంటిపై స్పృహ లేనట్లు బిడ్డకు పాలిచ్చే పసితల్లిని చూసో, నా చుట్టూ ఉన్న మనుషుల విన్యాసాలు, మాటలు, పరిస్థితులు వీటన్నింటినీ నాలుగక్షరాల్లో పొదిగినపుడు నాకొక తృప్తి.

వేదనకు ఊరట, కసికి సాంత్వన, పలకలేని మాటకు భాష్యం,  మౌనానికి రూపం.

అందుకే రోజు వారీ అంశాలను వ్రాయలేని నిస్సహాయతతో సమూహదూరం నేను ఉన్నా పాఠకురాలినే.

నాకోసం నేనే కాక , సమాజంలోని నాలాటి వారి కోసం

వేసట నిండిన మనసుల ఊరట కోసం, నేను వ్రాస్తున్నాను కవిత్వం.

నిశ్శబ్దపర్జన్యాలు నానీల సంకలనం చేశానండీ. 🙏

యూట్యూబ్‌లో కథలు చదివి వినిపిస్తున్నాను – సౌగంధికా కథా మంజరి పేరుతో.

సుభాషిణి ప్రత్తిపాటి ✍️ తెలుగు ఉపాధ్యాయిని బాపట్ల

prattipatisubhashini003@gmail.com

Exit mobile version