Site icon Sanchika

ఇది నా కలం-18 : వెల్మజాల నర్సింహ

ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు.

వెల్మజాల నర్సింహ:

నమస్తే. నా పేరు వెల్మజాల నర్సింహ. కవిని, కథకుడిని.

‘జీవితమంటే అలుపు లేని పయనం, నిరంతర పోరాటం’ అని విశ్వసిస్తాను.

యాదాద్రి భువనగిరి జిల్లా లోని వలిగొండ మండలం లోని దుప్పల్లి మా స్వగ్రామం. మాది వ్యవసాయక కుటుంబం.

నాన్న రైతు. నాలుగోవ సంతానం నేను. చిన్నప్పటినుండీ తెలుగు భాషపై మమకారంతో తొమ్మిది తరగతి నుండి చిన్న కవితలు, కథలు రాయడం మెుదలెట్టాను.

మా నాన్నకి పొలం పనులలో చెదోడు వాదోడుగా వున్నా, చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.

అనివార్య కారణాల వలన 2002 సంవత్సరంలో ముంబయి రావడం జరిగింది. కాని సాహిత్యంపై మక్కువతో ఈనాడు దినపత్రికలో Contributor గా పనిచేసాను.

దుప్పల్లి నుండి ముంబయి వరకు సాగిన నా జీవన సమరంలో ఎన్నో కష్టాలను, ఎత్తు పల్లాలను చవిచూశాను.

చాలా వెబ్ పత్రికలలో నేను రాసిన కవితాలు ప్రచురితమైనాయి.

చాలా మంది పెద్దల పొత్సహంతో ‘అగ్ని శిఖ’ కవితా సంపుటి వెలువరించాను.

✍ వెల్మజాల నర్సింహ

teluguvel@gmail.com

Exit mobile version