[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
లక్కవరం సుధాకర్
[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.
నా పేరు లక్కవరం సుధాకర్ (57). నా తల్లి తండ్రులు – శ్రీ లక్కవరం రామారావు, శ్రీమతి లక్కవరం సుభరత్నమ్మ. నా శ్రీమతి కరణం శ్యామల. మాకు ఒక అబ్బాయి సాయి చందన్. స్వస్థలం అనంతపురం అయినప్పటికీ గత 40 సంవత్సరముల నుండి కర్నూలు లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాము.
చదువు : BA, MD.sujok. వృత్తి: ఆక్యుపంచర్ & ఆక్యుప్రెషర్ థెరపిస్ట్.
1980 నుంచి కవితలు,చిన్న చిన్న రచనలు చేస్తున్నాను.
రాయాలని తపన పడే నా జిజ్ఞాసను తృప్తి పరచుకోవడానికి వ్రాసినవే అన్నీ.
ఏదో వ్రాయడం, తెలిసిన నలుగురితో పంచుకోవడం వారు మెచ్చుకొంటే మురిసిపోవడం, తర్వాత మరచిపోవడం. అంతేగానీ వాటిని జాగ్రత్త పరుస్తామని ఎప్పుడూ అనుకోలేదు.
కాలక్రమేణా రాయడం మానేసినా, 2020 ఏప్రిల్ నుండి ఈ కరోనా పుణ్యమా అని బయట తిరిగే పనిగాని, ఒకరు మనవద్దకు వచ్చేదిగానీ లేదు, మరి వ్యాసంగం అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా అని ఎప్పుడు పక్కన పెట్టిన కాలం చేబట్టి రాయడం మొదలు పెట్టాను. అయితే మొదలు పెట్టిన రోజే కలం మొరాయించింది. “కలం చేబట్టి కాగితంపై పెట్టి కళ్ళు మూసుకొని కూర్చున్న కవిత రాదు” అని నేను ఎప్పుడో వ్రాసిన నా కవితే నాకు గుర్తుకు వచ్చింది.
ఎవరన్నా ఏదన్నా చెబుతున్నప్పుడు అందులో ఏదన్నా ప్రత్యేక విషయం నన్ను ప్రేరేపిస్తే ఆ విషయాన్ని పట్టుకొని దానిమీద నాదైన శైలిలో కథానికగా మలచి ఆనందించడం నా హాబీ. ముందే చెప్పనుగా రాయాలని తపన పడే నా జిజ్ఞాసను తృప్తి పరచుకోవడానికి వ్రాసినవే అన్నీ.