[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]
గడ్డం మురళీకృష్ణ
[dropcap]న[/dropcap]మస్తే…..
నా పేరు గడ్డం మురళీకృష్ణ,
భారతి సాహిత్య వేదిక ఒక వాట్సాప్ గ్రూప్. అందులో బల్లా విజయకుమార్ సార్ నన్ను జాయిన్ చేశారు. అక్కడ దేశిరాజు గారి కథలు చూసి నేను కూడా రాయడం ప్రారంభించాను.. ఆ వాట్సాప్ సమూహం నన్ను రచయితగా, గజల్ కవిగా తీర్చిదిద్దింది.
రచనలు:
ఆయుధం, పునాది, ప్రతిఫలం, హెల్మెట్, ఉపకారం…. వంటి కథలు నలభైకు పైగా ఇప్పటివరకు రాశాను.
‘రాజా వారి మహల్’ పేరుతో ఒక ధారావాహిక 51 భాగాలు గత సంవత్సరం జూన్, జూలై మాసాలలో ప్రతీ రోజూ ఒక ఎపిసోడ్ చొప్పున రాశాను.
ప్రస్తుతం ‘మట్టి మనుషులు’ పేరుతో ఒక ధారావాహిక ఆదివారం ఒక్క రోజు మాత్రమే రాస్తున్నాను.
గజల్ ప్రక్రియను అమితంగా ఇష్టపడి ఇప్పటివరకు ఒక పాతిక పైచిలుకు గజల్స్ రాశాను… పేరున్న గాయకులు కొన్ని పాడిన సందర్భాలు వున్నాయి.
పెక్కు కవితలు, గేయాలు కూడా రాశాను..
ఇప్పటి వరకు ఏ ఒక్క రచన కూడా పుస్తక రూపంలో ప్రచురించబడలేదు.
ఇది నా గురించి నేను చెప్పుకోగలిగిన వివరణ.
గడ్డం.మురళీకృష్ణ.
Lic డెవలప్మెంట్ ఆఫీసర్,
5-1-669/303, శ్రీ వెంకట రామ ఎన్క్లేవ్, న్యూ విజన్ స్కూల్ దగ్గర, ఖమ్మం