[dropcap]2[/dropcap]021 జూలై నాలుగవ తారీఖున విడులయ్యే సంచికనుంచీ, సంచిక వెబ్ పత్రికలో సరికొత్త శీర్షిక ప్రారంభం…
తెలుగులో కొత్తగా రచనలు చేసేవారందరూ ఒక సమస్యను ఎదుర్కుంటారు…
వారెంత బాగా రాసినా కొన్ని పత్రికలలో ప్రచురితం కావు. కొందరు ఏమీ రాయకపోయినా గొప్పగా చలామణీ అవుతారు. రాయటం చేతకాక పోయినా వేదికలెక్కి రచనలెలా చేయాలో ఉపన్యాసాలు దంచుతూంటారు. అవార్డులు సంపాదించుకుని అందనంత ఎత్తున అందలాలెక్కి కూచుంటారు.
ఇది కొత్తగా రాస్తున్న వారిలో రకరకాల సంశయాలను కలిగిస్తుంది.
ఇలా రాయటం రాకున్నా గొప్ప రాతగాళ్ళుగా చలామణీ అయ్యేవారంతా కొన్ని మాఫియా ముఠాలకు చెంది వుంటారు. ఆయా ముఠాలో వాళ్ళు పదేపదే వీరిని ప్రస్తావిస్తూ కృత్రిమ గొప్పతనాన్ని ఆపాదిస్తూంటారు. అంటే గుర్తింపు తెచ్చుకోవాలంటే రచయితలు ఈ మాఫియా ముఠాల్లో చేరాలి. వారు చెప్పినట్టు రాయాలి. అంటే రచయితగా ఎదగకున్నా పేరుకోసం ముఠాల్లో చేరాలి.
ఇందుకు భిన్నంగా ఉన్న వాన్నవారికి భవిష్యత్తు ప్రవల్లిక, గమ్యం ప్రహేళిక…..
అందుకే అనేకులు రచనలు మానుకోవటమో, లేక గుంపుల్లో చేరి అస్తిత్వం కోల్పోవటమో జరుగుతోంది.
అది నిన్నటి మాట…
నూతన రచయితలందరి స్వరంగా సంచిక నిలుస్తూ వారికి వేదిక కల్పిస్తోంది.
నూతన రచయితలు తమని తాము పరిచయం చేసుకునే వేదిక ‘ఇది నా కలం’ … జూలై 4వ తేదీ నుంచీ సంచికలో ఆరంభమవుతోంది.
ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు… ఈ రకంగా ఎవరో గుప్పెడు గుంపుల రచయితలు కాక ఎంతమంది నవ రచయితలున్నారో, రచనాసక్తులున్నారో తెలుస్తుంది…
ఈ శీర్షికకు రచనలు kmkp2025@gmail.com కు పంపించండి… …
రచయితలను సాహితీ ప్రపంచానికి పరిచయంచేసే ఈ యజ్ఞంలో భాగస్వాములు కండి….