[dropcap]పే[/dropcap]రు గొప్ప ఊరు దిబ్బ
అన్నట్లుగానే
అంతా చట్ట ప్రకారమే
ప్రశ్నించడానికి అవకాశమున్న కూడా
జరిగేటివి జరిగిపోతూనే ఉంటాయి
అపరిమితమైన స్వేచ్ఛను ప్రసాదించిన
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా మనది
బాధితులు న్యాయం కోసం
వేచి చూస్తూనే ఉంటారు
అపరాధులు సందు చూసుకొని
ఎగిరిపోతూనే ఉంటారు
ఇక్కడింతే
నేరాలు శిక్షలు సమాంతర రేఖల్లా
సాగుతూనే ఉంటాయి
అయినా కానీ
అవిశ్రాంత ఉద్యమాలతో
పిడికిళ్ళు ఒక్కటవుతూనే ఉంటాయి..!