[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘ఇంపైన కెంపువు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ[/dropcap] కోసం
నేను కవితాక్షరమై ఉదయిస్తా
నీ కోసం
నేను ప్రేమ సుమ నందనమై విరబూస్తా
నీ కోసం
నేను నవ వసంతమై వలచొస్తా
నీ కోసం
నేను ప్రణయభావమై అర్చిస్తా
నీ కోసం
నేను అమరమధువునై వర్షిస్తా
నీ కోసం
నేను సుస్వరగీతమై నీలో లయిస్తా
నీ కోసం
నేను శ్వాస నై
నీ కోసం
నేను అందెలమువ్వనై
నీ కోసం
నేను నుదిటిన కుంకుమ రేణువై
ఎదురుచూస్తున్నా
ఇంపైన కెంపులా
నాకోసం ఎదురొస్తావని..