[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]
ఆ గది గుర్తొస్తున్నది
[dropcap]నే[/dropcap]నేప్పుడయినా
బతుకు మంటల్లో దగ్ధమయి నప్పుడు
నేనో ఇతరులో పలికిన అబద్దాలతో
అలసి పోయినప్పుడూ
అందరితో పోట్లాడుతూ
నాతో నేను ఓడిపోయినప్పుడూ
నేనా గది లోకి వెళ్తుంటాను
పలుచని చిక్కని గోధుమ రంగు
కల గలిసిన గది అది
ఆ గది కన్న తల్లి లా తన
మృదువయిన బాహువుల్లో పొదువుకుని నిద్ర పుచ్చుతుంది
పట్టపగలు ఎండలో బయట తిరిగే
అవసర మేమిటని గద్దిస్తుంది
నాకా గది గుర్తొస్తుంది
ఓ తండ్రి తన ధృడ మయిన గుండెలో
సముద్రమంత సున్నితత్వాన్ని దాచుకున్నట్టు
ఆ గది తలుపులు గట్టిగానూ ధృడంగానూ వుండి
తెరవడం కష్టంగా వుండేది
కవలల్లా ఒకేలా వున్న ఆ రెండు కుర్చీలూ
నా స్నేహితులే
మంచి మనసూ పెంకితనమూ ఉన్న
ఆ అద్దమూ
ముసలి నర్సులా మూలనున్న బీరువా
అద్దాన్ని మంధలిస్తోంది
ఆ ఇద్దరినీ చూసి
గడుసయిన పుష్పగుచ్చం నవ్వుతోంది
కిటికీ పైన జాలువారిన అందమయిన తీగ
అర్థవంతమయిన నవ్వు నవ్వుతోంది
బయట వసారాలోనూ అరల్లోనూ
చెవిలో గుస గుస చెపుతున్న పుస్తకాలు
కానీ అవి నా కోసమే వేచి వున్నాయి
వాటి నేమయినా అడగాలి
నిద్రకు నేస్తాలూ అలసటకు ఉపశమనాలూ
ఆ మృదువయిన తల దిండ్లూ
వాటి పై తల ఆనించి
ఇంటి పై కప్పు వైపు చూసే వాణ్ని
పై కప్పు దూలాల మధ్య ఎన్ని కథలు మొదలయ్యాయో
ఎవరికీ తెలుసు
గోడకు వేలాడుతున్న చిత్రాలూ
ఎదురుగా ఉన్న చిన్న టేబుల్
నా వైపు ప్రేమతోనూ విశ్వాసం తోనూ చూసేవి
ఎదో ఒక రోజు
నేనిట్లా వెళ్ళిపోతానని
ఇక ఎప్పటికీ తిరిగి రాకుండా నిష్క్రమిస్తానని
వాటికేప్పుడూ తోచ లేదు
నేనిప్పుడు ఉంటున్న ఇల్లు ఎంతో అందమయిందే
కానీ అక్కడ మౌనంగా కూర్చుని
ఆ గది నాతో
ఎట్లా ఎంతగా మాట్లేదని
మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్