Site icon Sanchika

‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

కన్నీటి చుక్క   

[dropcap]ఎ[/dropcap]వరిదో దుఃఖాన్ని గురించి విన్నప్పుడు
నా కనురెప్పలపై
ఓ కన్నీటి చుక్క

ఈ కనీళ్ళు అంటే ఏమిటి

దయాగుణానికీ
మానవత్వం పట్ల నాకున్న ప్రేమకూ
ఈ కన్నీళ్లు సాక్ష్యాలా

నా స్వార్థ రహిత జీవితానికి
ఇవి దాఖలా లా

ఇతరుల హృదయ విదారక
కథ విని కదిలిపోయి
నా లోపల కొట్టుకుంటున్న
సున్నిత హృదయాన్ని ఈ కన్నీళ్లు
ప్రదర్శిస్తున్నాయా

ఇతరుల బాధల్లో
కాలిపోయి కరిగి పోయి
నన్నునేను ప్రశ్నించుకుంటున్నాను

ఆ కథ విన్నప్పుడే
ఇప్పుడే ఈ కన్నీటి చుక్క రూపొందిందా

ఈ కన్నీళ్ళు ఇంతకు ముందు లేవనుకుంటా

నా అనుమానం ఏమిటంటే

నా కళ్ళకూ హృదయానికీ నడుమ
ఎక్కడో దూరంగా వున్నాయి

ఎక్కడయితే అనుభూతుల నగరాలు వున్నాయో
ఎక్కడయితే కలలు సమాధి చేయబడ్డాయో
ఎక్కడయితే బాధల పూదోటలు
ద్వేష పు ముల్లుల్ని పోషిస్తున్నాయో
అక్కడ ఇంక ఏమీ లేవు

ఇంకొంచెం ముదుకు వెళ్తే
దట్టమయిన ఆందోళనల అడవులున్నాయి

ఈ కన్నీటి చుక్క బహుశ
అక్కడ ఎన్నో రోజులుగా అక్కడ దాగి వుందేమో
దానికి జన్మ నిచ్చిన దుఖం
స్వార్థం చేతిలో హత్య చేయబడిందో ఏమో

మరి ఎవరి అకారణ కన్నీళ్లు చూసి
గర్వ పడతావు
దారి తేలీని ఈ కన్నీటి చుక్క
కనీస గౌరవంలేని అనాధ

దారి తెలీని ఈ కన్నీటి చుక్క
భయ పడుతూ వెనకడుగు వేస్తూ నిలబడి పోయింది

ఇవ్వాళ ఎవరిదో బాధల గాధల
ఊరేగింపు ఈ దారంటవెంట వెళ్తూ వుంటే
ఆ కథ ఆధారం లభిస్తే
తనకు బయట పడే అవకాశం ఒకటి దొరుకుతుంది

ఆ కథ వేళ్ళను పట్టుకుని
తన దుఖాన్ని చాటుకుంటూ
ఏవేవో ప్రశ్నలు వేస్తూ
ఈ కన్నీళ్లు
నా కను రెప్పల పైకి
ఉబికి ఉబికి వచ్చాయి

మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

Exit mobile version