Site icon Sanchika

‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-5

ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్.

ఒప్పుకోలు   

నిజం చెప్పాలంటే
తప్పు నాదే

నేను
చంద్రున్ని తాకాలనుకున్నాను
ఆకాశాన్ని నేలమీదికి
దిగి రమ్మని అర్థించాను

రాళ్ళపై పూలు వికసించాలని కోరుకున్నాను
ముళ్ళపై పరిమళాల్ని వెతికాను
నిప్పుల్లో చల్లదనాన్ని ఆశించాను

నేను కన్న కల
నిజం కావాలనుకున్నాను

అందుకుగాను
నేను శిక్షార్హున్నే
నాకు శిక్ష పడాల్సిందేనని
ఒప్పుకుంటున్నాను

మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

Exit mobile version