[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఇంకో అడుగు దగ్గరగా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఏ[/dropcap] క్షణం పుట్టావో నాలో
తెలియని వయసు నా ఇష్టానిది..
ఏ పుణ్యం చేసుకుందో మనసు
తెలియని బంధం నీ పరిచయానిది..
ఎలా గడిచిందో కాలం
ఎంతో లోతుగా రహస్యంగా..
ఎలా గడిపిందో మనసు
ఇంత తీయగా మధురంగా..
మరో ఏడాది వేసే
ఇంకో అడుగు దగ్గరగా
నీ ఇష్టం కోరుతుంది
నీవు సంతోషమై
నాకూ కొంతైనా ఉండాలని