[box type=’note’ fontsize=’16’] ఇనకులతిలకుడు రాముడు పుణ్యగుణాభిరాముడికి రామనవమి సందర్భంగా కవి శంకర ప్రసాద్ అర్పిస్తున్న కవితా పుష్పం “ఇనకులతిలకుడు“.[/box]
రూపం చూస్తే నల్లన
మనసు మాత్రం తెల్లన
పలికేది నిజం ఎల్లప్పుడు
తండ్రి మాట దాటడెప్పుడూ
రాజైనా ఆలి ఒక్కరే
ప్రజాక్షేమం ధ్యేయమొక్కటే
ముష్కర రక్కసులను చంపి
ఇలలో ధర్మము నిలిపిన
రాశీభూతమైన ధర్మస్వరూపుడు
రవికులమున నవమినాడు
ఉదయించిన చంద్రుడు
ఇనకులతిలకుడు శ్రీరాముడు